Bhagavanth Kesari 16 Days Collections: బాలయ్యకు చిన్న సినిమాల దెబ్బ.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోలలో ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నది నటసింహా నందమూరి బాలకృష్ణే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆయన వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నారు.

ఈ జోష్‌లోనే ఆయన ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీగా వచ్చాయి. అయితే, రెండో వారం నుంచి క్రమంగా డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 'భగవంత్ కేసరి' మూవీ 16 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం పదండి!

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

భగవంత్ కేసరిగా బాలయ్య రాక: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ అయింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 16వ రోజు 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 25 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

16 రోజులకూ కలిపి ఎంతంటే?: 16 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 17.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.65 కోట్లు, గుంటూరులో రూ. 5.18 కోట్లు, కృష్ణాలో రూ. 2.95 కోట్లు, నెల్లూరులో రూ. 2.40 కోట్లతో కలిపి.. రూ. 53.59 కోట్లు షేర్, రూ. 91.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 53.59 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.19 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 16 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66.48 కోట్లు షేర్‌, రూ. 136 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 16 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సందేశాత్మక కథతో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 66.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.02 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X