Bhagavanth Kesari 17 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. మొత్తంగా అన్ని కోట్లు.. హిట్‌కు చేరువ
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఊపులోనే ఆయన మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇటీవలే ఈ సీనియర్ హీరో 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి మంచి టాక్ రావడంతో ఆరంభం నుంచీ రెస్పాన్స్ భారీగా లభిస్తోంది. అయితే, మధ్యలో కాస్త స్లో అవడంతో వసూళ్లు క్రమంగా డౌన్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో కాస్త రెస్పాన్స్ పెరిగింది. మరి 'భగవంత్ కేసరి' మూవీ 17 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దామా!
భగవంత్ కేసరి చిచ్చా వచ్చాడు
నటసింహా బాలకృష్ణ హీరోగా నటించిన సందేశాత్మక చిత్రమే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్
'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.

17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భగవంత్ కేసరి'కి 17వ రోజు ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 46 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
17 రోజులకూ కలిపి ఎంతంటే?
17 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 17.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.67 కోట్లు, గుంటూరులో రూ. 5.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.97 కోట్లు, నెల్లూరులో రూ. 2.42 కోట్లతో కలిపి.. రూ. 54.04 కోట్లు షేర్, రూ. 92.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 54.04 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.21 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 17 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.00 కోట్లు షేర్, రూ. 137 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 67.00 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.50 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











