Bhagavanth Kesari 18 Days Collections: సండే మాస్ ఊచకోత.. కోట్ల బిజినెస్ ఔట్.. 57 లక్షలు వస్తే చరిత్రే

ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను సంతృప్తి పరుస్తోన్న హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన.. ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

దీనికి మంచి టాక్ రావడంతో ఆరంభం నుంచీ స్పందన మంచిగానే వస్తోంది. అయితే, మధ్యలో కాస్త స్లో అవడంతో వసూళ్లు క్రమంగా డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్‌లో కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 18 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూడండి!

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

విజ్జి పాపతో భగవంత్ చిచ్చా రాక: నటసింహా నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీనే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి' ఫిల్మ్‌కు నైజాంలో రూ. 18.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ అయింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి 18వ రోజు ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 45 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 73 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

18 రోజులకూ కలిపి ఎంతంటే?: 'భగవంత్ కేసరి'కి 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.26 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.70 కోట్లు, గుంటూరులో రూ. 5.24 కోట్లు, కృష్ణాలో రూ. 3.01 కోట్లు, నెల్లూరులో రూ. 2.44 కోట్లతో కలిపి.. రూ. 54.87 కోట్లు షేర్, రూ. 93.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 54.87 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 18 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.93 కోట్లు షేర్‌, రూ. 139 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సందేశాత్మక కథతో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో దీనికి రూ. 67.93 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 57 లక్షలు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ చేరుతుంది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 18 Days Worldwide Collections

బిజినెస్ ఔట్.. హిట్ కోసమే: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ సినిమా 18 రోజుల్లో కంప్లీట్ చేసేసింది. అయితే, క్లీన్ హిట్ స్టేటస్ రావాలంటే మాత్రం రూ. 57 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోతే అఫీషియల్‌గా బాలయ్య హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X