Bhagavanth Kesari 1st Week Collections: 68.50 కోట్ల సినిమా.. వారంలో సంచలనం.. బాలయ్య మరో రికార్డు

సాధారణంగానే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అలాంటిది హిట్లు మీద హిట్లు పడుతుంటే ఆయన ఏ రేంజ్‌లో చెలరేగిపోతారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ హీరో.. తాజాగా 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చారు. దీనికి ఆరంభం నుంచీ మంచి స్పందన వస్తుండడంతో కలెక్షన్లు కూడా భారీగానే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం పదండి!

నేలకొండ భగవంత్ కేసరి ఎంట్రీ:నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల కీలక పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీగా నిర్మించారు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 1st Week Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.

7వ రోజు ఇలా.. మొత్తంగా అలా:క్రేజీ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాను ఏడో రోజు కూడా మంచి ఆదరణ లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 4 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 5 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 55 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. దీంతో బాలయ్య ఎన్నో రికార్డులు కొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X