Bhagavanth Kesari 2 Weeks Collections: 68 కోట్లు రావాలి.. 2 వారాల్లో వచ్చిందిదే.. ఇంతకీ హిట్టా కాదా?

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకుని సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించే సినిమాలతో వస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతోన్న ఆయన.. అదే ఊపును కంటిన్యూ చేస్తూ ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా పడిపోతున్నాయి. మరి 'భగవంత్ కేసరి' మూవీ 14 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూడండి!

ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చింది:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఫాదర్ సెంటిమెంట్ మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

 Balakrishna Starrer Bhagavanth Kesari Movie 2 Weeks Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:14వ రోజు 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 44 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

 Balakrishna Starrer Bhagavanth Kesari Movie 2 Weeks Worldwide Collections

14 రోజులకూ కలిపి ఎంతంటే?:'భగవంత్ కేసరి'కి 14 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 17.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.63 కోట్లు, గుంటూరులో రూ. 5.15 కోట్లు, కృష్ణాలో రూ. 2.92 కోట్లు, నెల్లూరులో రూ. 2.38 కోట్లతో కలిపి.. రూ. 52.94 కోట్లు షేర్, రూ. 90.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 52.94 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 14 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 65.74 కోట్లు షేర్‌, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 Balakrishna Starrer Bhagavanth Kesari Movie 2 Weeks Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 65.74 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.76 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ చేరుతుంది.

 Balakrishna Starrer Bhagavanth Kesari Movie 2 Weeks Worldwide Collections

పోటీ ఉన్నా బాగానే రాబట్టింది:నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి రెస్పాన్స్ క్రమంగా డౌన్ అవుతోంది. ముఖ్యంగా వీక్ డేస్‌లో ఈ సినిమా అనుకున్న రీతిలో రాణించడం లేదు. అయినప్పటికీ 2 వారాల్లో 96 శాతానికి పైగానే వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఇది మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నా బాగానే రాబట్టి హిట్‌కు చేరువగా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X