Bhagavanth Kesari 20 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 14 లక్షలు దూరంలో.. బాలయ్య సంచలన రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ఒక్కరు మాత్రం వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. ఆయన నటసింహా నందమూరి బాలకృష్ణ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ స్టార్ హీరో హిట్లతో సత్తా చాటుతోన్నారు. ఈ జోష్‌లోనే ఇటీవలే ఈ నందమూరి హీరో 'భగవంత్ కేసరి' అనే చిత్రంతో వచ్చారు. దీనికి మంచి టాక్ రావడంతో ఆరంభంలో కలెక్షన్లు పోటెత్తాయి. మధ్య కాస్త డౌన్ అయినా వీకెండ్‌లో పుంజుకున్నాయి. కానీ, ఇప్పుడు మళ్లీ పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 20 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూడండి!
భగవంత్ కేసరిగా బాలయ్య రాక:నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 20.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.
20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరంభంలో భారీ వసూళ్లు వచ్చాయి. మధ్యలో మాత్రం క్రమంగా పడిపోతూ వచ్చాయి. అలాంటిది వీకెండ్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లతో సత్తా చాటింది. అయితే, 20వ రోజు మాత్రం ఒక్కసారిగా రెస్పాన్స్ పడిపోయింది. దీంతో రూ. 15 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

20 రోజులకూ కలిపి ఎంతంటే?:20 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.71 కోట్లు, గుంటూరులో రూ. 5.24 కోట్లు, కృష్ణాలో రూ. 3.03 కోట్లు, నెల్లూరులో రూ. 2.46 కోట్లతో కలిపి.. రూ. 55.24 కోట్లు షేర్, రూ. 94.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 రోజుల్లో రూ. 55.24 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.27 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 20 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.36 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లో దీనికి రూ. 68.36 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14 లక్షలు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.
హ్యాట్రిక్ విజయాల దిశగా:ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ సినిమా ఇప్పటికే కంప్లీట్ చేసేసింది. అయితే, క్లీన్ హిట్ స్టేటస్ రావాలంటే మాత్రం రూ. 14 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోతే బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్లు వచ్చి చేరుతాయి.


Click it and Unblock the Notifications











