Bhagavanth Kesari 26 Days Collections: బాలయ్య మరో సంచలనం.. ఏకంగా అన్ని కోట్లు.. 50 లక్షలు వస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొంత మంది స్టార్లు మాత్రమే ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ మధ్య కాలంలో వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి సక్సెస్‌లను చూసిన ఆయన.. ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందన అదిరిపోయేలా దక్కింది. దీంతో ఈ చిత్రం డీసెంట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 26 రోజుల వసూళ్లను చూద్దామా!
భగవంత్ కేసరిగా బాలయ్య రాక:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రను పోషించిన ఈ మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' ఫిల్మ్‌కు నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.
26వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరంభంలో భారీ వసూళ్లు వచ్చాయి. మధ్యలో మాత్రం క్రమంగా పడిపోతూ వచ్చాయి. వీకెండ్‌లో మళ్లీ పెరిగినా.. తర్వాత తగ్గుతున్నాయి. అయితే, 26వ రోజు రెస్పాన్స్ భారీగా పెరిగింది. దీంతో దీనికి రూ. 40 లక్షలు షేర్ వసూలు అయింది.

26 రోజులకూ కలిపి ఎంతంటే?:26 రోజుల్లో 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.33 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.72 కోట్లు, గుంటూరులో రూ. 5.28 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో కలిపి.. రూ. 56.28 కోట్లు షేర్, రూ. 96.65 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 26 రోజుల్లో రూ. 56.28 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 26 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.50 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి రూ. 69.50 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.08 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, ఈ చిత్రం రూ. 50 లక్షలు సాధిస్తే 70 కోట్ల మార్క్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











