Bhagavanth Kesari 3 Days Collections: బాలయ్య ఊచకోత.. 3వ రోజు ఊహించని విధంగా.. అప్పుడే అన్ని కోట్లా!
ఏజ్ పెరుగుతున్న ఏమాత్రం అలసిపోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ.. ఇప్పటికీ తన మార్కెట్‌ను పెంచుకుంటూనే దూసుకెళ్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన.. మరింత జోష్‌తో మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన లభిస్తోంది. మూడో రోజు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మరి 'భగవంత్ కేసరి' 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం పదండి మరి!
సందేశాత్మక కథతో వచ్చిన కేసరి
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా.. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన సందేశాత్మక చిత్రమే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్
'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 3వ రోజూ రెస్పాన్స్ బాగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 4.62 కోట్లు షేర్, రూ. 8.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతంటే?
'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో అదిరే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 7.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.36 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, గుంటూరులో రూ. 3.55 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో కలిపి.. రూ. 23.08 కోట్లు షేర్, రూ. 37.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడు రోజుల్లో రూ. 23.08 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.48 కోట్లు షేర్, రూ. 71 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 29.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 39.02 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.
ఓవర్సీస్‌లో రికార్డుకు చేరువ
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా మూడు రోజుల్లోనే ఈ చిత్రం అక్కడ 900K డాలర్ల మార్కును చేరుకుంది. ఇదే ఊపులో 1 మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా చేరేందుకు అతి దగ్గరగా వచ్చేసిందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











