Bhagavanth Kesari 3 Weeks Collections: టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర.. ఏకైక హీరోగా బాలయ్య రికార్డు

'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఊపులోనే ఆయన ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందన అదిరిపోయేలా దక్కింది. దీంతో ఈ చిత్రం డీసెంట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలోనే తాజాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసింది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 3 వారాల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూడండి!

భగవంత్ కేసరిగా వచ్చిన బాలయ్య:నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రను పోషించిన ఈ మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా చేశాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 3 Weeks Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ అయింది.

21వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:నందమూరి బాలకృష్ణ, శ్రీలీల మెయిన్ రోల్స్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' మూవీకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఆరంభంలో భారీ వసూళ్లు వచ్చాయి. మధ్యలో మాత్రం క్రమంగా పడిపోతూ వచ్చాయి. వీకెండ్‌లో మళ్లీ పెరిగినా.. తర్వాత తగ్గుతున్నాయి. ఇలా 20వ రోజు రెస్పాన్స్ మరింతగా పడిపోయింది. దీంతో రూ. 13 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 3 Weeks Worldwide Collections

21 రోజులకూ కలిపి ఎంతంటే?:'భగవంత్ కేసరి'కి 21 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.71 కోట్లు, గుంటూరులో రూ. 5.25 కోట్లు, కృష్ణాలో రూ. 3.03 కోట్లు, నెల్లూరులో రూ. 2.47 కోట్లతో కలిపి.. రూ. 55.37 కోట్లు షేర్, రూ. 94.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:21 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 55.37 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.87 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.52 కోట్లు షేర్‌, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 3 Weeks Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:సందేశాత్మక కథతో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 21 రోజుల్లో దీనికి రూ. 68.52 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2 లక్షలు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

హ్యాట్రిక్ హిట్లతో సంచలనం:ఎమోషనల్ కంటెంట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 68.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 3 వారాల్లో దీన్ని ఈ సినిమా చేరుకుని హిట్ అయింది. ఫలితంగా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న సీనియర్ హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. అలాగే, వరుసగా మూడు రూ. 68 కోట్ల సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X