Bhagavanth Kesari 4 Days Collections: బాలయ్య సంచలనం.. అప్పుడే అన్ని కోట్లు.. ఏకైక హీరోగా రికార్డు
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన మరిన్ని ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దసరా సెలవులు ఉండడంతో ఈ చిత్రం వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటసింహం నటించిన 'భగవంత్ కేసరి' 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం పదండి మరి!
ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చారు:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించాడు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.
4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:
'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 4వ రోజూ రెస్పాన్స్ మరింత పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి.. రూ. 5.52 కోట్లు షేర్, రూ. 9.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి ఎంతంటే?:'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో అదిరే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 9.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.58 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.71 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, గుంటూరులో రూ. 3.88 కోట్లు, కృష్ణాలో రూ. 1.54 కోట్లు, నెల్లూరులో రూ. 1.32 కోట్లతో కలిపి.. రూ. 28.60 కోట్లు షేర్, రూ. 47.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 28.60 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.75 కోట్లు షేర్, రూ. 83 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 36.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.75 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.
ఓవర్సీస్‌లో పెను సంచలనం:నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి ఓవర్సీస్‌లోనూ భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా వరుసగా మూడు మిలియన్ డాలర్ మూవీలతో బాలయ్య సత్తా చాటారు. అదే సమయంలో ఈ ఘనత అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా రికార్డు సాధించారు.


Click it and Unblock the Notifications











