Bhagavanth Kesari 4 Weeks Collections: బాలయ్య సెన్సేషన్.. తెలుగులోనే ఏకైక హీరోగా.. 16 లక్షలు వస్తే!
చాలా కాలం పాటు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదురు కావడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయితే,'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత మాత్రం ఆయన చెలరేగిపోతూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నారు. ఈ జోష్‌లోనే ఇటీవలే బాలయ్య 'భగవంత్ కేసరి' అనే మూవీతో వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా దక్కింది. దీంతో ఈ చిత్రం డీసెంట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 4 వారాల వసూళ్లను చూద్దామా!
విజ్జి పాపతో వచ్చేసిన భగవంత్
నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన దీనిని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్
'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.

28వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరంభంలో భారీ వసూళ్లు వచ్చాయి. మధ్యలో మాత్రం క్రమంగా తగ్గిపోయినా.. వీకెండ్‌లో మళ్లీ పెరిగాయి. ఇలా హెచ్చుతగ్గులతో సాగుతోన్న ఈ చిత్రం 28వ రోజు ఓ మోస్తరు రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో దీనికి రూ. 14 లక్షలు షేర్ వసూలు అయింది.
28 రోజులకూ కలిపి ఎంతంటే?
'భగవంత్ కేసరి'కి 28 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.73 కోట్లు, గుంటూరులో రూ. 5.31 కోట్లు, కృష్ణాలో రూ. 3.09 కోట్లు, నెల్లూరులో రూ. 2.55 కోట్లతో కలిపి.. రూ. 56.60 కోట్లు షేర్, రూ. 97.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
28 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 56.60 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 28 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.84 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 28 రోజుల్లో దీనికి రూ. 69.84 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.34 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, ఈ చిత్రం రూ. 16 లక్షలు సాధిస్తే 70 కోట్ల మార్క్ చేరుతుంది. దీంతో వరుసగా మూడు సార్లు ఈ మార్కు చేరిన హీరోగా బాలయ్య సంచలన రికార్డును సృష్టిస్తారు.


Click it and Unblock the Notifications











