Bhagavanth Kesari 5 Days Collections: దసరా రోజు కుమ్మిన కేసరి.. ఏకంగా అన్ని కోట్లతో బాలయ్య రికార్డు

'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే వరుసగా మరిన్ని సినిమాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ఈ సీనియర్ హీరో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా దసరా రోజు కూడా ఈ మూవీ కుమ్మేసింది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' 5 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

ఫాదర్ - డాటర్ సెంటిమెంట్‌తో:నందమూరి బాలకృష్ణ - శ్రీలీల నటించిన ఫాదర్ - డాటర్ సెంటిమెంట్‌తో వచ్చిన మూవీనే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించాడు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie 5 Days Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 4వ రోజూ రెస్పాన్స్ కాస్త తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 1.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి.. రూ. 4.90 కోట్లు షేర్, రూ. 8.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకూ కలిపి ఎంతంటే?
'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో అదిరే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 10.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.99 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.71 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.01 కోట్లు, గుంటూరులో రూ. 4.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.89 కోట్లు, నెల్లూరులో రూ. 1.59 కోట్లతో కలిపి.. రూ. 33.50 కోట్లు షేర్, రూ. 56.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 33.50 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.40 కోట్లు షేర్‌, రూ. 93 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 42.40 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 26.10 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ చేరుతుంది.

హ్యాట్రిక్ 40 కోట్లతో రికార్డు
నటసింహా నందమూరి బాలకృష్ణ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 40 కోట్లు షేర్ వసూలు చేసింది. ఫలితంగా వరుసగా మూడు చిత్రాల ద్వారా నలభై కోట్ల మార్కును చేరి బాలయ్య సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X