Bhagavanth Kesari 6 Days Collections: ఇటు 50 అటు 100 కోట్లు ఔట్.. ఏకైక తెలుగు హీరోగా బాలయ్య రికార్డు
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం అలసిపోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఇటీవలి కాలంలో ఆయన హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఈ ఊపులోనే బాలయ్య ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా భారీగా వస్తోంది. దీంతో వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి మరి!
భగవంత్ కేసరిగా బాలయ్య రాక:నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన మూవీనే 'భగవంత్ కేసరి'. శ్రీలీల ప్రధాన పాత్రను చేసిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్:'భగవంత్ కేసరి' ఫిల్మ్‌కు నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 6వ రోజూ రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 2.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 85 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి.. రూ. 6.93 కోట్లు షేర్, రూ. 12.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంతంటే?:'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో అదిరే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.10 కోట్లు, గుంటూరులో రూ. 4.54 కోట్లు, కృష్ణాలో రూ. 2.28 కోట్లు, నెల్లూరులో రూ. 1.84 కోట్లతో కలిపి.. రూ. 40.98 కోట్లు షేర్, రూ. 68.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు రోజుల్లో రూ. 40.98 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.88 కోట్లు షేర్, రూ. 101 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబోలో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 50.88 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.62 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.

ఇటు 50.. అటు 100 కోట్లు ఉఫ్:నటసింహా నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా షేర్‌తో పాటు రూ. 100 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో హ్యాట్రిక్ 100 కోట్లు సాధించిన ఏకైక తెలుగు సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సాధించారు.


Click it and Unblock the Notifications











