Bhagavanth Kesari 9 Days Collections: 9వ రోజు ఊహించని వసూళ్లు.. మొత్తం అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!
టాలీవుడ్‌లోని సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' విజయాలు ఇచ్చిన జోష్‌లో ఉన్న ఆయన.. ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు.
దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా ఈ సినిమాకు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' మూవీ 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

భగవంత్ కేసరి ఎంట్రీ ఇచ్చాడు: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమానే 'భగవంత్ కేసరి'. శ్రీలీల కీలక పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి'కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 7వ రోజూ రెస్పాన్స్ కాస్త తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.24 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
9 రోజులకూ కలిపి ఎంతంటే?: 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.34 కోట్లు, గుంటూరులో రూ. 4.85 కోట్లు, కృష్ణాలో రూ. 2.60 కోట్లు, నెల్లూరులో రూ. 2.11 కోట్లతో కలిపి.. రూ. 47.41 కోట్లు షేర్, రూ. 80.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 47.41 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.32 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 9 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.31 కోట్లు షేర్, రూ. 110 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 58.31 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.19 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.

విజయం దిశగా సాగుతోంది: నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా 9 రోజుల్లోనే 85 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలను వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











