Bhagavanth Kesari Total Collections: బాలయ్య కొత్త చరిత్ర.. టాలీవుడ్‌లో తొలి హీరో.. మరి లాభం ఎంతంటే!
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండా వరుసగా పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను కొడుతోన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ జోష్‌లోనే ఇటీవలే బాలయ్య 'భగవంత్ కేసరి' అనే మూవీతో వచ్చారు. దీనికి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా దక్కింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' మూవీ క్లోజింగ్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
భగవంత్ కేసరిగా బాలయ్య ఎంట్రీ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన దీనిని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్ : 'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్‌తో భారీ వసూళ్లు : నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ మూవీకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇదే ఊపును కంటిన్యూ చేసిన ఈ సినిమా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో రన్‌ను భారీ కలెక్షన్లతోనే క్లోజ్ చేసుకుంది.

తెలుగులో ఎన్ని కోట్లు అంటే : 'భగవంత్ కేసరి'కి ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 18.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.36 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.73 కోట్లు, గుంటూరులో రూ. 5.31 కోట్లు, కృష్ణాలో రూ. 3.09 కోట్లు, నెల్లూరులో రూ. 2.56 కోట్లతో కలిపి.. రూ. 56.75 కోట్లు షేర్, రూ. 97.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే : ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 56.75 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.31 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70.01 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి దీనికి రూ. 70.01 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.51 కోట్లు లాభాలు వచ్చాయి.
మూడు 70 కోట్లతో అరాచకం : నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాలతో హిట్లు కొట్టారు. ఈ క్రమంలోనే 'భగవంత్ కేసరి'తో ఆయన హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నారు. అంతేకాదు, వరుసగా మూడు సార్లు రూ. 70 కోట్లు అంతకంటే ఎక్కువ షేర్ సాధించిన సినిమాలతో బాలయ్య చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సీనియర్ హీరోగా నిలిచారు.


Click it and Unblock the Notifications











