Bhagavanth Kesari Day 1 Collections: KCPD చిచ్చా.. తొలి రోజే అన్ని కోట్లు.. ఆ రికార్డు దాటలేదుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఎన్నో విభాగాల్లో సత్తా చాటుతూ సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉన్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం పదండి!
భగవంత్ కేసరి చిచ్చా వచ్చాడు
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. దీనికి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్
'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్.. రెస్పాన్స్ భారీగా
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి ఓవర్సీస్‌లో పడిన ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సుస్పష్టం అయింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈవినింగ్ షోలు అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. మొత్తంగా భగవంత్ కేసరి చిచ్చా మేనియానే కనిపించింది.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భగవంత్ కేసరి'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, గుంటూరులో రూ. 3.09 కోట్లు, కృష్ణాలో రూ. 76 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో కలిపి.. రూ. 14.36 కోట్లు షేర్, రూ. 25.82 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 14.36 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.27 కోట్లు షేర్, రూ. 32.33 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 18.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 50.23 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
కెరీర్‌లో మూడో అత్యధికం
నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొంది 'భగవంత్ కేసరి' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.27 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో బాలయ్య కెరీర్‌లో మూడో అత్యధిక ఓపెనింగ్‌గా ఇది నిలిచింది. గతంలో 'వీర సింహా రెడ్డి' మూవీకి రూ. 25 కోట్లు షేర్ వసూలు అవగా.. 'అఖండ'కు రూ. 18.74 కోట్లు వసూలు అయ్యాయి.


Click it and Unblock the Notifications











