Bhagavanth Kesari 2 Days Collections: 2వ రోజు షాకింగ్‌గా.. అన్ని కోట్లతో అరాచకం.. ఆ రికార్డుకు చేరవ

'అఖండ', 'వీర సింహా రెడ్డి'తో వరుసగా రెండు భారీ హిట్లను కొట్టి.. కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. దీనికి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది.

దీంతో మొదటి రోజు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబట్టి సత్తా చాటింది. ఇక, రెండో రోజు పోటీ మరింతగా పెరిగినా డీసెంట్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

విజ్జి పాపతో వచ్చేసిన భగవంత్: నటసింహా నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ మూవీనే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. దీనికి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

భగవంత్ కేసరి బిజినెస్ డీటేల్స్: 'భగవంత్ కేసరి' మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భగవంత్ కేసరి'కి ఏపీ, తెలంగాణలో 2వ రోజూ రెస్పాన్స్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 96 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 4.10 కోట్లు షేర్, రూ. 7.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే?: 'భగవంత్ కేసరి'కి తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో అదిరే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 5.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.12 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.17 కోట్లు, గుంటూరులో రూ. 3.31 కోట్లు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 84 లక్షలతో కలిపి.. రూ. 18.46 కోట్లు షేర్, రూ. 29.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 18.46 కోట్లు రాబట్టిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.49 కోట్లు షేర్‌, రూ. 40.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 23.49 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 45.01 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Day 2 Worldwide Collections

మరో రికార్డుకు చేరువగానే: నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం అక్కడ 750K డాలర్ల మార్కును చేరుకుంది. ఇదే ఊపులో 1 మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా చేరేందుకు చేరువ అయింది. ఇదే జరిగితే బాలయ్య ఖాతాలో మరో రికార్డు వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X