Bhagavanth Kesari: బాలయ్య మూవీకి బిగ్ షాక్.. అఖండ, వీర సింహా రెడ్డి కంటే తక్కువగా!
చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయినా.. 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'తో వచ్చి మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు చేయడానికి సన్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య 'భగవంత్ కేసరి' అనే మూవీ చేశారు. ఈ చిత్రం థియేటర్ల కౌంట్‌ను మీరే చూడండి!
నందమూరి బాలకృష్ణ హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ సినిమానే 'భగవంత్ కేసరి'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికితోడు ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం అక్టోబర్ 19న ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. నేటి రాత్రి నుంచి ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అలాగే, గురువారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో కూడా షోలు అత్యధికంగా ప్రదర్శితం కాబోతున్నాయి.
'భగవంత్ కేసరి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ రూ. 67.35 కోట్లు వరకూ జరిగింది. దీనికి తగ్గట్లే ఈ సినిమా నైజాంలో 285, సీడెడ్‌లో 200, ఆంధ్రాలో 410 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 900 థియేటర్ల వరకూ విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100, ఓవర్సీస్‌లో 350 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1345 నుంచి 1400 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

వాస్తవానికి బాలయ్య గత చిత్రాలు 'అఖండ' 1550 థియేటర్లలో, 'వీర సింహా రెడ్డి' 1465 థియేటర్లలో విడుదల అయ్యాయి. అలాంటిది 'భగవంత్ కేసరి' మూవీకి విజయ్ 'లియో' నుంచి పోటీ ఉండడంతో థియేటర్ల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయినప్పటికీ తీవ్రమైన పోటీలో కూడా ఈ రేంజ్‌లో విడుదల కావడం గొప్ప విషయం అనే అంటున్నారు.
ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు.


Click it and Unblock the Notifications











