twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy Day 12 Collections: అతి తక్కువగా బాలకృష్ణ సినిమాకు వసూళ్లు.. ఇలా ఇదే తొలిసారి!

    |

    నందమూరి నటసింహం బాలయ్య బాబు తాజాగా గర్జించిన చిత్రం వీర సింహారెడ్డి. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులకు, ఒక వర్గానికి ఈ సినిమా తెగ నచ్చగా.. మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    అయితే వీర సింహా రెడ్డికి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్సే రాబడుతోంది. తాజాగా వీర సింహా రెడ్డి విజయోత్సవ వేడుక కూడా జరిగింది. ఇదిలా ఉంటే వీర సింహా రెడ్డి సినిమాకు వచ్చిన 12 రోజులు అంటే 2 వారాల ఇండియా నెట్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

    ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

    ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

    నందమూరి బాలకృష్ణ, బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది వీర సింహా రెడ్డి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదు అయింది.

    ఆక్యుపెన్సీ డీటేల్స్ ఇలా..

    ఆక్యుపెన్సీ డీటేల్స్ ఇలా..

    నట సింహం బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేస్తుంది. వీర సింహా రెడ్డి 12వ రోజు ఆక్యుపెన్సీ వివరాలు ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ 35.33 శాతం, బెంగళూరు 31.67 శాతం, చెన్నై 19.67 శాతం, విజయవాడ 10.67 శాతం, వరంగల్ 47 శాతం, గుంటూరు 6.33 శాతం, విశాఖపట్నం 35.33 శాతం, నిజామాబాద్ 12.33 శాతం, కాకినాడ 11 శాతం, నెల్లూరు 10.33, ముంబై 1 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది.

    థియేటర్ షోస్ పరంగా చూసుకుంటే..

    థియేటర్ షోస్ పరంగా చూసుకుంటే..

    ఇక బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉందని పలువురు చెప్పుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న వీర సింహా రెడ్డి సినిమాకు సోమవారం కారణంగా థియేటర్లు వెలవెల బోయినట్లు తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాకు 12వ రోజు ఉదయం షోలకు 28 శాతం థియేటర్ ఆక్యుపెన్సి తో నమోదు కాగా మధ్యాహ్నం వచ్చేసరికి కాస్తా పెరిగి 29.81 శాతంగా నమోదైంది. అయితే ఇంకాస్తా పెరగాల్సిన సాయంత్రం షోలకు 26.61 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయి తగ్గింది. మార్నింగ్ షోస్ కంటే సాయంత్రం షోలు తక్కువగా నమోదు కావడం గమనార్హం.

    అత్యంత తక్కువగా 12 రోజు కలెక్షన్స్..

    అత్యంత తక్కువగా 12 రోజు కలెక్షన్స్..

    పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు అనౌన్స్ మెంట్ నుంచే మంచి బజ్ క్రియేట్ అంయింది. ఫలితంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అనంతరం కలెక్షన్లు కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే 12వ రోజు సోమవారం కారణంగా కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. వీర సింహా రెడ్డి సినిమా 12 రోజు అత్యంత తక్కువగా రూ. 1 కోటి నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా విడుదలైనప్పటి నుంచి చూసుకుంటే ఇదే తక్కువ వసూళ్లు అని తెలుస్తోంది.

    రెండు వారాల్లో వచ్చేది..

    రెండు వారాల్లో వచ్చేది..

    బాలకృష్ణకు అభిమాని అయిన గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీర సింహా రెడ్డి సినిమాలోని డైలాగ్స్ విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటకీ కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు మొత్తంగా 12 రోజులు (2 వారాలకు) కలిపి రూ. 93.60 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

    English summary
    Balakrishna Shruti Haasan And Director Gopichand Malineni Combination Movie Veera Simha Reddy 12 Days Expected Box Office Collection Is Approximately Rs 93.60 Cr. And Day 12 Collection Is Rs 1 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X