Veera Simha Reddy Day 5 Collections: తగ్గిన వీరసింహారెడ్డి కలెక్షన్లు.. ఊహించని విధంగా 5వ రోజు వసూళ్లు

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా సినిమా వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా.. పవర్ ఫుల్ విలన్ గా దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టగా.. తర్వాత కొంత డౌన్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వీర సింహా రెడ్డి సినిమాకు ఐదో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయన్న వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది వీర సింహా రెడ్డి.

ఆక్యుపెన్సీ వివరాలు..

ఆక్యుపెన్సీ వివరాలు..

ద్విపాత్రాభినయం చేసిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేస్తుంది. వీర సింహా రెడ్డి ఐదో రోజు ఆక్యుపెన్సీ వివరాలు ఓసారి చూస్తే.. హైదరాబాద్ 52.67 శాతం, బెంగళూరు 35 శాతం, చెన్నై 55.33 శాతం, విజయవాడ 60.33 శాతం, వరంగల్ 26 శాతం, గుంటూరు 65.67 శాతం, విశాఖపట్నం 72.33 శాతం, నిజామాబాద్ 20 శాతం, కరీంనగర్ 76 శాతం, కాకినాడ 88 శాతం, నెల్లూరు 87.67, ముంబై 7 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది.

థియేటర్ షోస్ పరంగా చూసుకుంటే..

థియేటర్ షోస్ పరంగా చూసుకుంటే..

ఇక బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉందని పలువురు చెప్పుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న వీర సింహా రెడ్డి సినిమా థియేటర్లు సందడిగా నెలకొంటున్నాయి.

ఇక ఈ సినిమాకు ఐదో రోజు ఉదయం షోలకు 37.92 శాతం థియేటర్ ఆక్యుపెన్సి తో నమోదు కాగా మధ్యాహ్నం వచ్చేసరికి పెరిగి 50.93 శాతంగా నమోదైంది. ఇక సాయంత్రం షోలకు ఇంకాస్తా పెరుగుతూ 56.82 శాతంగా ఆక్యుపెన్సీ నెలకొంది.

అతి తక్కువగా ఐదో రోజు..

అతి తక్కువగా ఐదో రోజు..

పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు అనౌన్స్ మెంట్ నుంచే మంచి బజ్ క్రియేట్ అంయింది. ఫలితంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అనంతరం కలెక్షన్లు కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే 5వ రోజు సోమవారం కారణంగా కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. వీర సింహా రెడ్డి సినిమా ఐదో రోజు అతి తక్కువగా రూ. 7 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఐదు రోజుల్లో వచ్చేది..

ఐదు రోజుల్లో వచ్చేది..

బాలకృష్ణకు అభిమాని అయిన అయిన గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీర సింహా రెడ్డి సినిమాలోని డైలాగ్స్ విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు మొత్తం ఐదు రోజులు కలిపి రూ. 71.40 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X