Veera Simha Reddy: రిలీజ్‌ ముందే బాలయ్య రికార్డు.. అన్ని కోట్లతో సంచలనం.. చిరంజీవి మూవీ మాత్రం!

ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోగా హవాను చూపిస్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించే సినిమాలతో వస్తోన్న ఆయన.. అఖండ తర్వాత నుంచి మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టత్మకంగా రాబోతున్న ఈ మూవీ ఓ రికార్డు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే..!

వీరసింహారెడ్డిగా మారిన బాలయ్య

వీరసింహారెడ్డిగా మారిన బాలయ్య

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమే 'వీరసింహారెడ్డి'. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

జెట్ స్పీడ్.. సంక్రాంతికి విడుదల

జెట్ స్పీడ్.. సంక్రాంతికి విడుదల

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. దీన్ని గత ఏడాది చివరికి పూర్తి చేసేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన పనులను జెట్ స్పీడుతో చేస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో 12న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

 ప్రమోషన్స్ షురూ.. ఈవెంట్‌లోనే

ప్రమోషన్స్ షురూ.. ఈవెంట్‌లోనే

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను మరింత ముమ్మరం చేసేశారు. ఈ క్రమంలోనే జనవరి 6న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

బాలయ్య మూవీకి రికార్డ్ బిజినెస్

బాలయ్య మూవీకి రికార్డ్ బిజినెస్

బాలయ్య హీరోగా గోపీచంద్ తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఓ రేంజ్‌లో పోటీ పడిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది.

నైజాం ఏరియా కోసమే అన్ని కోట్లు

నైజాం ఏరియా కోసమే అన్ని కోట్లు

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా హక్కులకు తీవ్రస స్థాయిలో పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ నైజాం ఏరియా హక్కుల కోసం చాలా మంది బడా ప్రొడ్యూసర్లు పోటీ పడ్డారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏరియా హక్కులు రూ. 15 కోట్లుకు అమ్మినట్లు తెలిసింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక మొత్తం కావడం విశేషం.

 అఖండ ఎఫెక్ట్ వల్లే అంత ధరకు

అఖండ ఎఫెక్ట్ వల్లే అంత ధరకు

బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ నైజాం హక్కులు రూ. 10.50 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేశారు. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 22 కోట్ల వరకూ షేర్ రాబట్టింది. దీంతో ఇప్పుడు గోపీచంద్ తెరకెక్కించే సినిమాకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఒక్క నైజాం ప్రాంతానికి సంబంధించిన హక్కులు రూ. 15 కోట్లుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.

వాల్తేరు వీరయ్యకు ఎంత రేటు?

వాల్తేరు వీరయ్యకు ఎంత రేటు?

బాలయ్య సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవి - రవితేజ కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, దీనికి సంబంధించిన నైజాం ఏరియా రైట్స్‌ ఏకంగా రూ. 18 కోట్లకు అమ్ముడపోయినట్లు తెలిసింది. అలాగే, మొత్తంగా ఈ చిత్రానికి రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X