Veera Simha Reddy 12 Days Collections: 2 వారాలకు బ్రేక్ ఈవెన్ పూర్తి.. బాలయ్య సినిమాకు లాభాలు ఎంతంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి జనవరి 12న దిగింది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడని టాక్ వినిపిస్తోంది. మరోసారి బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అలాగే మరోవైపు సినిమా మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. అయితే మౌత్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లవైపు దుసుకుపోతున్నాడు వీర సింహా రెడ్డి. ఈ క్రమంలో బాలకృష్ణ వీర సింహా రెడ్డి 12 రోజుల (2 వారాల) కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు తొలిసారిగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ 'వీర సింహా రెడ్డి'. ఈ సినిమాలో బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్ గా చేయగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి వివిధ ఇండస్ట్రీకి చెందిన స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి నిర్మించగా.. ఎస్ఎస్ తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది వీర సింహా రెడ్డి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఫిక్స్ అయింది.

12వ రోజు ఎక్కడెక్కడా ఎంతొచ్చింది..
బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ మూవీ 'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12వ రోజు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 12వ రోజు నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో కలుపుకుని మొత్తంగా రూ. 16 లక్షల షేర్, రూ. 32 లక్షల గ్రాస్ వసూళు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు కలిపి..
బాలకృష్ణ-శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 వారాల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఫలితంగా 12 రోజుల్లో నైజాంలో రూ. 16.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.13 కోట్లు, గుంటూరులో రూ. 6.30 కోట్లు, కృష్ణాలో రూ. 4.62 కోట్లు, నెల్లూరులో రూ. 2.88 కోట్లతో కలుపుకుని టోటల్ గా రూ. 63.55 కోట్లు షేర్, రూ. 102.87 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల కలెక్షన్లు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 12 రోజుల్లో రూ. 63.55 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.71 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 12 రోజుల్లో అంటే 2 వారాల్లో బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.02 కోట్లు షేర్, రూ. 124.51 కోట్లు గ్రాస్ వచ్చింది. కేవలం 12వ రోజు మాత్రం వరల్డ్ వైడ్ గా రూ. 18 లక్షల షేర్, రూ. 36 లక్షల గ్రాస్ సాధించింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక వీర సింహా రెడ్డికి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 74.02 కోట్లు వచ్చాయి. అంటే వీర సింహా రెడ్డి సినిమా 2 వారాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండారూ. 2 లక్షల లాభాలను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











