Veera Simha Reddy Collections: కొనసాగుతున్న బాలయ్య వసూళ్ల సునామీ.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా గర్జించిన చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి జనవరి 12న దిగింది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడని టాక్ వినిపిస్తోంది. మరోసారి బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అలాగే మరోవైపు సినిమా మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. అయితే మౌత్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లవైపు దుసుకుపోతున్నాడు వీర సింహా రెడ్డి. ఈ క్రమంలో బాలకృష్ణ తాజా సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమన్ మ్యూజిక్ అందించగా..

తమన్ మ్యూజిక్ అందించగా..

మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు తొలిసారిగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి వివిధ ఇండస్ట్రీకి చెందిన స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి నిర్మించగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక అందించాడు.

 ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..

అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలకృష్ణ తాజా సినిమా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది వీర సింహా రెడ్డి.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు వసూళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు వసూళ్లు..


బాలకృష్ణ-శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండో రోజు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో రోజు నైజాంలో రూ. 7.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.95 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.30 కోట్లు, గుంటూరులో రూ. 3.76 కోట్లు, కృష్ణాలో రూ. 1.99 కోట్లు, నెల్లూరులో రూ. 1.35 కోట్లతో కలిపుకుని రూ. 30.70 కోట్లు షేర్, రూ. 48.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు..

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రెండు రోజుల్లో రూ. 30.70 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే రోజు బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 37.30 కోట్లు షేర్‌, రూ. 61.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక వీర సింహా రెడ్డికి రెండు రోజుల్లో రూ. 37.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 36.70 కోట్లు రాబడితే బాలకృష్ణ-గోపిచంద్ మలినేని వీర సింహా రెడ్డి సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X