Veera Simha Reddy 10 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. బాలయ్య మరో రికార్డు.. హిట్ అవ్వాలంటే!

బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేసే ఆయన.. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ స్టార్ హీరో ఇటీవలే 'వీర సింహా రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి 10 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ


నటసింహా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

 వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు


బాలయ్య రేంజ్‌కు అనుగుణంగానే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరిగింది.

 10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'వీర సింహా రెడ్డి' 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 97 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

 10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


10 రోజుల్లోనూ 'వీర సింహా రెడ్డి' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 16.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.03 కోట్లు, గుంటూరులో రూ. 6.18 కోట్లు, కృష్ణాలో రూ. 4.48 కోట్లు, నెల్లూరులో రూ. 2.79 కోట్లతో కలిపి.. రూ. 61.95 కోట్లు షేర్, రూ. 100.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 61.95 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.64 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.65 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 72.24 కోట్లు షేర్‌, రూ. 121.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 72.24 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.76 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

మరో రికార్డు క్రియేట్ చేసిన హీరో

మరో రికార్డు క్రియేట్ చేసిన హీరో


బాలయ్య నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 100 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా ఈ మార్కునే వేగంగా చేరుకున్న బాలయ్య సినిమాగా ఇది రికార్డు సాధించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X