Veera Simha Reddy 11 Days Collections: బాలయ్య మాస్ కొట్టుడు.. అన్ని లక్షలు వస్తే సంచలనమే

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం స్లో అవకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్యనే 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన.. మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి టాక్ ఒకలా వస్తే.. కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. రెండు రోజులుగా డౌన్ అయిన వసూళ్లు.. ఆదివారం పెరిగాయి. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి 11 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే ఓ లుక్కేయండి మరి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ మాస్

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ మాస్


నటసింహా బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'వీర సింహా రెడ్డి'. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని ఇచ్చాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

బాలయ్య మార్కెట్ ప్రకారమే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'వీర సింహా రెడ్డి' 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.28 షేర్, రూ. 2.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

11 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

11 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

11 రోజుల్లోనూ 'వీర సింహా రెడ్డి' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 16.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.49 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.12 కోట్లు, గుంటూరులో రూ. 6.29 కోట్లు, కృష్ణాలో రూ. 4.62 కోట్లు, నెల్లూరులో రూ. 2.87 కోట్లతో కలిపి.. రూ. 63.23 కోట్లు షేర్, రూ. 102.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 63.23 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 73.68 కోట్లు షేర్‌, రూ. 123.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బాలయ్య - గోపీచంద్ కలయికలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి దాదాపు రూ. 73.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 32 లక్షలు వరకూ రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

అదే జరిగితే బాలయ్యకు రికార్డు

అదే జరిగితే బాలయ్యకు రికార్డు

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇక, ఈ సినిమాకు దాదాపుగా మరో రూ. 50 లక్షలు వస్తే క్లీన్ హిట్ స్టేటస్ వస్తుంది. అదే జరిగితే ఈ మధ్య కాలంలో రూ. వంద కోట్లు గ్రాస్‌తో వరుసగా రెండు హిట్లు కొట్టిన సీనియర్ హీరోగా ఆయన రికార్డు సాధిస్తారని ట్రేడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X