twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy 15 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. లాభాలు చూస్తే!

    |

    ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా ఎనర్జీని చూపిస్తూ.. వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. మరీ ముఖ్యంగా 'అఖండ' సక్సెస్‌తో మాంచి ఊపులో ఉన్న ఆయన.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతికి ఆయన 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు తగ్గిపోతోన్నాయి. కానీ, 15వ రోజు కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' సినిమా 15 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

     వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ

    వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ

    టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ నటించిన తాజా సినిమానే 'వీర సింహా రెడ్డి'. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

    పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

    వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

    వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

    బాలయ్య రేంజ్‌కు అనుగుణంగానే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. అయితే, ఇప్పుడు 15వ రోజు మాత్రం వసూళ్లు మూడు రెట్లు పెరిగి దీనికి రూ. 26 లక్షలు షేర్ వసూలు అయింది.

    ఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షోఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షో

    15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    'వీర సింహా రెడ్డి' మూవీకి 15 రోజుల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.15 కోట్లు, గుంటూరులో రూ. 6.32 కోట్లు, కృష్ణాలో రూ. 4.66 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో కలిపి.. రూ. 65.16 కోట్లు షేర్, రూ. 105.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 65.16 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.74 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 15 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 75.68 కోట్లు షేర్‌, రూ. 127.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

    మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

    బాలయ్య - గోపీచంద్ కలయికలో తెరకెక్కిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 75.68 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.60 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

     హాలీడే లక్.. వీకెండ్‌లో భారీగానే

    హాలీడే లక్.. వీకెండ్‌లో భారీగానే

    నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. క్రమంగా డౌన్ అవుతున్నా రిపబ్లిక్ డే హాలీడే వల్ల దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు వచ్చాయి. ఇదే ఊపు ఈ వీకెండ్ మొత్తం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    English summary
    Nandamuri Balakrishna Veera Simha Reddy Released January 12th Worldwide. Now This Movie Collects 75.68 Crores In 15 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X