Veera Simha Reddy 16 Days Collections: బాలయ్యకు మరో షాక్.. మళ్లీ వసూళ్లు డౌన్.. ఆ మార్క్ చేరడం కష్టం
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులను అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. అలాంటిది 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి ఆయన 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు తగ్గిపోతోన్నాయి. అలాగే, 16వ రోజు మరింత పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' సినిమా 16 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

వీర సింహా రెడ్డిగా నటసింహం రాక
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'వీర సింహా రెడ్డి'. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు
బాలయ్య మార్కెట్‌ను మరింత పెంచేలా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు 16వ రోజు మాత్రం కూడా తగ్గాయి. దీంతో దీనికి రూ. 11 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

16 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
16 రోజుల్లో 'వీర సింహా రెడ్డి' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.15 కోట్లు, గుంటూరులో రూ. 6.32 కోట్లు, కృష్ణాలో రూ. 4.67 కోట్లు, నెల్లూరులో రూ. 2.95 కోట్లతో కలిపి.. రూ. 65.27కోట్లు షేర్, రూ. 105.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 65.27 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.74 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 16 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 75.79 కోట్లు షేర్, రూ. 127.52 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 75.79 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.79 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

ఆ మార్కును చేరడం కష్టమేనని
సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం రూ. 80 కోట్లు మార్క్ చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో ఆ మైలురాయిని చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ట్రేడ్ విశ్లేషకులూ అభిప్రాయపడుతోన్నారు.


Click it and Unblock the Notifications











