Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Veera Simha Reddy 17 Days Collections: వీకెండ్స్ కూడా అదే పరిస్థితి.. ఫైనల్ గా నిర్మాతలకు లాభం ఎంతంటే..
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి ఫెస్టివల్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే రోజురోజుకు తగ్గుతూ వచ్చాయి మొదట్లో వచ్చిన కలెక్షన్స్ అయితే మళ్లీ ఆ తర్వాత రాలేదు ఇక 17వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ కొంత పెరిగినప్పటికీ అంతగా భారీ స్థాయిలో లాభాలను అందించే మెంబర్స్ మాత్రం కావు ఇక మొత్తంగా ఇప్పటివరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎంత ప్రాఫిట్ తీసుకోవచ్చింది అనే వివరాల్లోకి వెళితే..
వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్
నందమూరి బాలకృష్ణ అఖండ తరువాత చేసిన సినిమా కాబట్టి 'వీర సింహా రెడ్డి'కి మంచి బిజినెస్ జరిగింది. ఇక నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది.
17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ అయితే తగ్గలేదు. ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ ఆ తరువాత అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు 17వ రోజు మాత్రం మరింత తగ్గాయి. శనివారం వీకెండ్ అయినప్పటికీ లక్షల్లోనే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు ఈ సినిమా రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది.
17 రోజుల్లో ఏపీ, నైజాం కలెక్షన్స్
17 రోజుల్లో 'వీర సింహా రెడ్డి' సినిమాకు ఏరియాల వారిగా నైజాం ఆంధ్ర లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.15 కోట్లు, గుంటూరులో రూ. 6.33 కోట్లు, కృష్ణాలో రూ. 4.68 కోట్లు, నెల్లూరులో రూ. 2.96 కోట్లతో కలిపి.. రూ. 65.41 కోట్లు షేర్, రూ. 106.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
ఏపీ నైజాంలో వీరసింహారెడ్డికి రూ. 65.41 కోట్లు వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.80 కోట్లు, ఓవర్సీస్లో రూ. 5.75 కోట్లు వసూలు చేసింది. ఇక 17 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.95 కోట్లు షేర్, రూ. 127.85 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్
'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో ఈ సినిమా మొత్తంగా రూ. 75.95 కోట్ల షేర్ అందుకుంది. అంటే ఈ వీర సింహా రెడ్డి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.95 కోట్లు లాభాలు అందుకుంది. ఇక సినిమా ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాల్సి ఉంది. నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు. మరి సినిమా ఈ ఆదివారం ఏమైనా కలెక్షన్స్ పెంచుకుంటుందో లేదో చూడాలి.