Veera Simha Reddy 18 Days Collections: టార్గెట్ పూర్తి చేసినా.. ఆ రెండు ఏరియాల్లో ఊహించని నష్టాలు..
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదట్లో మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక తర్వాత మెల్లగా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా మొత్తానికి టార్గెట్ ను అయితే పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రాఫిట్ లో కొనసాగుతోంది. ఇక మూడవ వీకెండ్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. అలాగే మొత్తంగా 18వ రోజు ఎంతగా కలెక్షన్స్ వచ్చాయి? ఇంకా ఏ ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంది అనే వివరాల్లోకి వెళితే...

వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్
నందమూరి బాలకృష్ణ, క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి'కి మంచి బిజినెస్ జరిగింది. ఇక సినిమా నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్
'వీర సింహా రెడ్డి' సినిమా మిక్స్‌డ్ టాక్ తో మొదట్లో కలెక్షన్స్ అయితే బాగానే అందుకుంది. కానీ వీకెండ్ అనంతరం భారీ స్థాయిలో తగ్గుతూ వచ్చాయి. ఇక 18వ రోజు మాత్రం కొంత కలెక్షన్స్ పెరిగాయి. శనివారం వీకెండ్ అయినప్పటికీ లక్షల్లోనే వచ్చాయి. ఆదివారం 17వ రోజు ఈ సినిమా రూ. 41 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.

18 రోజుల ఏపీ, నైజాం కలెక్షన్స్
18 రోజుల్లో 'వీర సింహా రెడ్డి' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా అందుకున్న లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 17.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.88 కోట్లు, గుంటూరులో రూ. 7.40 కోట్లు, కృష్ణాలో రూ. 4.70 కోట్లు, నెల్లూరులో రూ. 2.97 కోట్లతో GST తో కలిపి.. రూ. 68.52 కోట్లు షేర్, రూ. 111.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
ఏపీ నైజాంలో వీరసింహారెడ్డి సినిమా GST తో కలిపి రూ. 68.52 కోట్లు అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్ కలెక్షన్స్ చూసుకుంటే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.75 కోట్లు వసూలు చేసింది. ఇక 18 రోజుల్లో బాలయ్య నటించిన సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.09 కోట్లు షేర్, రూ. 132.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఆ రెండు ఏరియాల్లో నష్టాలు?
'వీర సింహా రెడ్డి' ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. 18 రోజుల్లో ఈ సినిమా మొత్తంగా రూ. 79.09 కోట్ల షేర్ అందుకుంది. అంటే ఈ వీర సింహా రెడ్డి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.09 కోట్ల లాభాలను అందుకుంది. ఇక సినిమా ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాల్సి ఉంది. ముఖ్యంగా కృష్ణలో 50 లక్షల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో కూడా 40 లక్షలు రావాల్సి ఉంది. సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరగకపోవచ్చు.


Click it and Unblock the Notifications











