twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy 19 Days Collections: బాలయ్యకు మళ్లీ దెబ్బ.. లాభాలతో రికార్డు.. ఆ ఏరియాలో నష్టాలే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఆ మధ్య కాలంలో మాత్రం వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో 'అఖండ'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు.. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి ఆయన 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 19 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

    వీర సింహా రెడ్డిగా బాలయ్య మాస్

    వీర సింహా రెడ్డిగా బాలయ్య మాస్

    నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ సినిమానే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

    Keerthy Suresh నిజమైన బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. రిసార్టులో దొరకడంతోనే!Keerthy Suresh నిజమైన బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. రిసార్టులో దొరకడంతోనే!

    వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు

    వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు


    బాలయ్య మార్కెట్‌కు తగ్గకుండా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరిగింది.

    19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు 19వ రోజు మాత్రం కూడా తగ్గాయి. దీంతో దీనికి రూ. 11 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

    జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!

    19 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    19 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    వీర సింహా రెడ్డి' మూవీకి 19 రోజుల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.88 కోట్లు, గుంటూరులో రూ. 7.40 కోట్లు, కృష్ణాలో రూ. 4.71 కోట్లు, నెల్లూరులో రూ. 2.97 కోట్లతో కలిపి.. రూ. 68.63 కోట్లు షేర్, రూ. 111.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, టీఎస్‌లో భారీ స్థాయిలో రూ. 68.63 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.76 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 19 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 79.21 కోట్లు షేర్‌, రూ. 132.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    జాకెట్ విప్పేసి దీప్తి సునైనా హాట్ షో: అది మాత్రమే చూడండి అంటూ షాకింగ్‌గా!జాకెట్ విప్పేసి దీప్తి సునైనా హాట్ షో: అది మాత్రమే చూడండి అంటూ షాకింగ్‌గా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

    బాలయ్య - గోపీచంద్ కలయికలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 79.21 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.21 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

    మరో 79 లక్షలు వస్తే సంచలనం

    మరో 79 లక్షలు వస్తే సంచలనం

    బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. అయితే, మరో రూ. 79 లక్షలు వసూలు అయితే ఈ చిత్రం రూ. 80 కోట్ల షేర్ మార్కును చేరుతుంది. ఇక, ఈ చిత్రానికి కృష్ణా ఏరియాలో రూ. 40 లక్షలు నష్టాలు వచ్చినట్లు తెలిసింది. ఇక, రూ. 5 కోట్ల లాభాలను చేరి ఇది మరో రికార్డు సాధించింది.

    English summary
    Nandamuri Balakrishna Veera Simha Reddy Released January 12th Worldwide. Now This Movie Collects 79.21 Crores In 19 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X