Veera Simha Reddy 2 Weeks Collections: వీర సింహం అరాచకం.. ఆ మూవీ రికార్డు బ్రేక్.. బాలయ్య సంచలనం
నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో సత్తా చాటుతూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' సినిమా 2 వారాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ ఎంట్రీ
నటసింహా బాలకృష్ణ నటించిన తాజా సినిమానే 'వీర సింహా రెడ్డి'. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు
బాలయ్య స్థాయికి తగ్గట్లుగానే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. 12వ రోజు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 14వ రోజు దీనికి రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?
'వీర సింహా రెడ్డి' మూవీకి 2 వారాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.14 కోట్లు, గుంటూరులో రూ. 6.30 కోట్లు, కృష్ణాలో రూ. 4.64 కోట్లు, నెల్లూరులో రూ. 2.93 కోట్లతో కలిపి.. రూ. 64.90 కోట్లు షేర్, రూ. 105.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 64.90 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.77 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.73 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 వారాల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 75.40 కోట్లు షేర్, రూ. 126.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలయ్య - గోపీచంద్ కాంబోలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి దాదాపు రూ. 75.40 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.40 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

కెరీర్‌లోనే టాప్ కలెక్షన్లతో రికార్డ్
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. క్రమంగా డౌన్ అవుతున్నా దీనికి రెండు వారాల్లోనే రూ. 75.40 కోట్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం 'అఖండ' లైఫ్ టైం కలెక్షన్లు రూ. 75.10 కోట్లు దాటేసింది. తద్వారా ఈ మూవీ బాలయ్య కెరీర్‌లో టాప్ మూవీగా రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











