Veera Simha Reddy 20 Days Collections: బాలయ్యకు బిగ్ షాక్.. తొలిసారి ఘోరంగా.. 72లక్షలు వస్తే చరిత్రే
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ జయాపజయాలను బేరీజు వేసుకోకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. 'అఖండ'తో బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి బాలయ్య 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది. కానీ, క్రమంగా వసూళ్లు డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 20 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

వీర సింహా రెడ్డిగా మారిన బాలయ్య
నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పవర్‌ఫుల్ మాస్ సినిమానే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు
బాలయ్య రేంజ్‌కు తగ్గట్లుగానే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ అయింది.

20వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నందమూరి బాలకృష్ణ - శృతి హాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు 20వ రోజు మాత్రం కూడా తగ్గాయి. దీంతో దీనికి రూ. 7 లక్షలు షేర్ మాత్రమే కలెక్ట్ అయింది.

20 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
20 రోజుల్లో 'వీర సింహా రెడ్డి' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.88 కోట్లు, గుంటూరులో రూ. 7.41 కోట్లు, కృష్ణాలో రూ. 4.71 కోట్లు, నెల్లూరులో రూ. 2.97 కోట్లతో కలిపి.. రూ. 68.70 కోట్లు షేర్, రూ. 111.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 68.70 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.76 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 20 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 79.28 కోట్లు షేర్, రూ. 132.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలయ్య హీరోగా గోపీచంద్ తెరకెక్కించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 79.28 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.28 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

మరో 72 లక్షలు వస్తే బెస్ట్ రికార్డు
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. అయితే, మరో రూ. 72 లక్షలు వసూలు అయితే ఈ చిత్రం రూ. 80 కోట్ల షేర్ మార్కును చేరుతుంది. అదే జరిగితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ షేర్ సాధించిన చిత్రంగా ఇది రికార్డు సాధిస్తుంది.


Click it and Unblock the Notifications











