Veera Simha Reddy 26 Days Collections: చరిత్ర సృష్టించిన బాలయ్య.. ఆ రికార్డులు దాటి నెంబర్ వన్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. హిట్లు ఫ్లాపులను బేరీజు వేసుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్తోన్న హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' సక్సెస్ తర్వాత మంచి ఊపులో ఉన్న ఆయన ఇటీవలే 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది.
దీంతో ఎన్నో రికార్డులను సైతం బాలయ్య బ్రేక్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రాక
నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన సినిమానే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు
బాలయ్య రేంజ్‌కు తీసిపోకుండా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ అయింది.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నటసింహా బాలకృష్ణ - శృతి హాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో దక్కాయి. కానీ, ఆ తర్వాత నుంచే వసూళ్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇక, 25వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 13 లక్షలు షేర్ రాగా.. 26వ రోజు మాత్రం కేవలం రూ. 5 లక్షలు షేర్ వసూలైంది.

26 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
26 రోజుల్లో 'వీర సింహా రెడ్డి' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.90 కోట్లు, గుంటూరులో రూ. 7.42 కోట్లు, కృష్ణాలో రూ. 4.74 కోట్లు, నెల్లూరులో రూ. 3.00 కోట్లతో కలిపి.. రూ. 69.06 కోట్లు షేర్, రూ. 112.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 69.06 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.77 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 26 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.68 కోట్లు షేర్, రూ. 133.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలయ్య హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 79.68 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.68 కోట్లు లాభాలు కూడా లభించాయి.

బాలయ్య కెరీర్‌లో బెస్ట్ మూవీగా
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం 26 రోజుల్లో రూ. 133.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీ 'అఖండ' రికార్డు రూ. 133.20 కోట్లును దాటింది. అలాగే, అఖండకు మొత్తంగా రూ. 75.10 కోట్లు షేర్ రాగా.. దీనికి రూ. 76.68 కోట్లు షేర్ వచ్చింది.


Click it and Unblock the Notifications











