Veera Simha Reddy 27 Days Collections: మరో సంచలనానికి బాలయ్య చేరువ.. అదే జరిగితే టాప్ ప్లేసే
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి ఆయన 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది. ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన మూవీ 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ ఎంట్రీ
నటసింహా బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన సినిమానే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు
బాలయ్య స్థాయికి తగ్గట్లుగానే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరిగింది.

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
బాలకృష్ణ - శృతి హాసన్ కలయికలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో దక్కాయి. కానీ, ఆ తర్వాత నుంచే వసూళ్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇక, 26వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 5 లక్షలు షేర్ రాగా.. 27వ రోజు మాత్రం కేవలం రూ. 4 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

27 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
'వీర సింహా రెడ్డి' మూవీకి 27 రోజుల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.91 కోట్లు, గుంటూరులో రూ. 7.42 కోట్లు, కృష్ణాలో రూ. 4.74 కోట్లు, నెల్లూరులో రూ. 3.01 కోట్లతో కలిపి.. రూ. 69.10 కోట్లు షేర్, రూ. 112.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో రూ. 69.10 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.77 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 27 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.72 కోట్లు షేర్, రూ. 133.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ తీసిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 79.72 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.72 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

మరో చరిత్రకు అడుగు దూరం
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం 27 రోజుల్లో రూ. 79.72 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 80 కోట్లు షేర్ మార్కును చేరుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇదే జరిగితే ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఈ మార్కు చేరిన మొట్టమొదటి చిత్రంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











