Veera Simha Reddy 3 Weeks Collections: 74 కోట్ల టార్గెట్.. 3 వారాల్లో షాకింగ్‌గా.. బాలయ్య మరో సంచలనం

బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి.. స్టార్‌గా వెలుగొందుతోన్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటుతోన్న ఆయన.. 'అఖండ' హిట్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బాలయ్య 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది. కానీ, క్రమంగా వసూళ్లు డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 3 వారాల్లో ఎంత రాబట్టిందో చూడండి!

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ


నటసింహా బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు.

 వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు


బాలయ్య మార్కెట్ ప్రకారమే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరిగింది.

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


నటసింహా బాలకృష్ణ - శృతి హాసన్ కలిసి నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచే అనుకున్న దాని కంటే వసూళ్లు తక్కువగా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు 21వ రోజు మరింతగా తగ్గిపోయాయి. దీంతో దీనికి రూ. 5 లక్షలు షేర్ మాత్రమే కలెక్ట్ వసూలైంది.

 3 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?

3 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?


3 వారాల్లో 'వీర సింహా రెడ్డి' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.88 కోట్లు, గుంటూరులో రూ. 7.41 కోట్లు, కృష్ణాలో రూ. 4.71 కోట్లు, నెల్లూరులో రూ. 2.97 కోట్లతో కలిపి.. రూ. 68.75 కోట్లు షేర్, రూ. 111.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 68.75 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.83 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.76 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 వారాల్లో బాలయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.34 కోట్లు షేర్‌, రూ. 132.85 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా


బాలయ్య హీరోగా గోపీచంద్ తీసిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో దీనికి మొత్తంగా రూ. 79.34 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.34 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

 బాలయ్య కెరీర్‌లో భారీ వసూళ్లు

బాలయ్య కెరీర్‌లో భారీ వసూళ్లు


టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. అయినప్పటికీ ఇది మూడు వారాల్లో రూ. 79.34 కోట్లు రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే, రూ. 80 కోట్లకు చేరువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X