Veera Simha Reddy 4 Weeks Collections: చరిత్ర సృష్టించిన బాలయ్య.. టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపించడంతో పాటు స్టార్ హీరోగా తన ప్రభావాన్ని చూపించుకుంటోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలానే ఇప్పటికీ ఒకటే స్పీడుతో వరుసగా సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి ఈ నందమూరి హీరో 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే దక్కింది. దీంతో కలెక్షన్లు భారీగానే దక్కుతోన్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన ఈ మూవీ నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూడండి మరి!

వీర సింహా రెడ్డిగా బాలయ్య రాక

వీర సింహా రెడ్డిగా బాలయ్య రాక

నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన మాస్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు

వీర సింహా రెడ్డి బిజినెస్ వివరాలు


బాలయ్య మార్కెట్‌కు అనుగుణంగా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ అయింది.

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


బాలకృష్ణ - శృతి హాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో దక్కాయి. కానీ, ఆ తర్వాత నుంచే వసూళ్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇక, 27వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 4 లక్షలు షేర్ రాగా.. 28వ రోజు కూడా అదే రీతిలో రూ. 4 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

4 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?

4 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?


'వీర సింహా రెడ్డి' మూవీకి 4 వారాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 17.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.91 కోట్లు, గుంటూరులో రూ. 7.42 కోట్లు, కృష్ణాలో రూ. 4.74 కోట్లు, నెల్లూరులో రూ. 3.01 కోట్లతో కలిపి.. రూ. 69.14 కోట్లు షేర్, రూ. 112.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో రూ. 69.14 కోట్లు రాబట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.77 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 వారాల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.76 కోట్లు షేర్‌, రూ. 133.85 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా


బాలకృష్ణ - గోపీచంద్ కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 28 రోజుల్లో దీనికి మొత్తంగా రూ. 79.76 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.76 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

చరిత్రను సృష్టించిన బాలయ్య

చరిత్రను సృష్టించిన బాలయ్య


నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం ఎన్నో రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ. కోటి వసూలు చేసింది. తద్వారా అతి తక్కువ వ్యవధిలో రెండు సార్లు ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా బాలయ్య చరిత్రను సృష్టించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X