Veera Simha Reddy 9 Days Collections: బాలయ్యకు షాక్.. 9వ రోజే ఘోరంగా.. అఖండ రికార్డు టచ్ చేయకుండానే!

అరవై ఏళ్ల వయసు వచ్చినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఆయన.. 'అఖండ' సక్సెస్ తర్వాత జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్నారు.

ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, 9వ రోజు మాత్రం ఈ మూవీ వసూళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి 9 రోజుల్లో ఎంత రాబట్టిందో ఓ లుక్కేద్దాం పదండి!

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ

వీర సింహా రెడ్డిగా బాలయ్య ఎంట్రీ

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు

బాలయ్య మార్కెట్ అనుగుణంగానే 'వీర సింహా రెడ్డి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ అయింది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రా, తెలంగాణలో 9వ రోజూ వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 94 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

9 రోజుల్లోనూ 'వీర సింహా రెడ్డి' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 16.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.98 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.96 కోట్లు, గుంటూరులో రూ. 6.10 కోట్లు, కృష్ణాలో రూ. 4.39 కోట్లు, నెల్లూరులో రూ. 2.72 కోట్లతో కలిపి.. రూ. 60.98 కోట్లు షేర్, రూ. 98.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 60.98 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.58 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 9 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 71.14 కోట్లు షేర్‌, రూ. 119.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

మాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 71.14 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.86 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

అఖండ రికార్డును టచ్ చేయలేదు

అఖండ రికార్డును టచ్ చేయలేదు

బాలయ్య 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అయితే, తొమ్మిదో రోజు మాత్రం దీనికి ఆంధ్రా, తెలంగాణలో కలిపి కోటి రూపాయలు కూడా రాలేదు. దీంతో కేవలం 8 రోజులు మాత్రమే ఆ మార్కును దాటినట్లు అయింది. దీంతో ఈ మూవీ 'అఖండ' (11 రోజులు) రికార్డును టచ్ కూడా చేయలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X