అఖండకు భారీ ఆఫర్.. ఒకే దెబ్బతో లాభాల్లోకి నిర్మాత.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లోనే విభిన్నమైన కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి మరో విజయాన్ని అందుకొనేందుకు ఈ క్రేజీ కాంబినేషన్ రెడీ అయింది. అయితే వారిద్దరి కలయికలో వస్తున్న అఖండ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అఖండ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

హ్యాట్రిక్ దిశగా బాలయ్య, బోయపాటి
టాలీవుడ్‌లో బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. సింహా, లెజెండ్ సినిమాలు వారిద్దరి కాంబినేషన్ స్టామినా ఏమిటో తెలియ చెప్పాయి. ఇక హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి అఖండ మూవీతో బాలయ్య, బోయపాటి సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టైటిల్ మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన
ఇలాంటి భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైన అఖండ చిత్రం టీజర్, టైటిల్ లుక్ పోస్టర్ మంచి స్పందనను అందుకొన్నది. దాదాపు 14 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో అఖండ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తున్నది.

స్టార్ మా ఛానెల్‌తో భారీ డీల్
అఖండ సినిమాకు సంబంధించిన శాటిలైట్, ఓటీటీ రైట్స్ బిజినెస్ భారీగా జరిగినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. బాలయ్య కెరీర్‌లో ఇంతకు ముందు లేని విధంగా భారీ మొత్తానికి అమ్మినట్టు తెలుస్తున్నది.

భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్
ఇక ఇటీవల కాలంలో అత్యంత క్రేజీగా మారిన డిజిటల్ మీడియా హక్కులను డిస్నీ హాట్‌స్టార్ చేజిక్కించుకొన్నట్టు సమాచారం. ఈ సినిమా హక్కుల విషయంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి, డిస్నీ హాట్‌స్టార్ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Recommended Video

అఖండలో నటీనటులు, సాంకేతిక వర్గం
అఖండ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
డైలాగ్స్: బోయపాటి శ్రీను, ఎం రత్నం
మ్యూజిక్: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్స్ కంపెనీ: ద్వారక క్రియేషన్స్
డిస్ట్రిబ్యూషన్: పెన్ స్టూడియోస్


Click it and Unblock the Notifications











