బాలకృష్ణ “లెజండ్” ఇంకో రికార్డు

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం "లెజండ్" మరో రికార్డు ని బ్రద్దలు కొట్టింది. ఈ చిత్రం మార్చి 28 నాటికి రిలీజై సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ రెండు థియోటర్ లలో ఈ చిత్రం ఆడుతూనే ఉంది. అంటే 365 రోజుల పోస్టర్... ఎమ్మిగినూరు, ప్రొద్దుటూరులో పడనుంది. ఇప్పటికి అక్కడ 350 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ రోజుల్లో రెండో వారం చిత్రం ఆడటం కష్టమన్న సమయంలో ఇలా కంటిన్యూగా సంవత్సరం పాటు ఆడటం అనేది ఓ రికార్డే. ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన లెజెండ్‌ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో అనిల్‌ సుంకర, గోపి ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలుగా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించారు. ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది.

సినిమా గురించి...

'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వెరసి 'లెజెండ్‌'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2014లో 'లెజెండ్‌' మర్చిపోలేని విజయాన్ని నమోదు చేసుకొంది.

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

Balayya “Legend” completes 350 days

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X