‘బలుపు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
హైదరాబాద్ : మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'బలుపు' చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు.
కాగా...ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 'బలుపు'చిత్రం తొలి రోజు టోటల్‌గా దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.3.9 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కచ్చితమైన లెక్కల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రవితేజ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు తాజా ఫలితాలతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక హీరో రవితేజ కెరీర్‌కు 'బలుపు' చిత్రం బూస్ట్ ఇచ్చిందని చెప్పుచ్చు. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ 'బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో మరో మెట్టు పైకెక్కారు. గోపీచంద్ డైరెక్షన్ స్టైల్ బాగుందని, అతనికి మంచి భవిష్యత్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ విన్సెంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.


Click it and Unblock the Notifications











