twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Banaras movie day 1 collections.. టైమ్ ట్రావెల్‌తో లవ్ స్టోరిగా బనారస్.. తొలి రోజు ఎంతంటే?

    |

    కర్ణాటక మాజీ మంత్రి కుమారుడు జైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం బనారస్. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ట్రైమ్ ట్రావెల్ కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం తొలి రోజున పాజిటివ్ టాక్‌తో జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    కన్నడ చిత్రాలకు దేశవ్యాప్తంగా

    కన్నడ చిత్రాలకు దేశవ్యాప్తంగా

    కన్నడ చిత్ర పరిశ్రమకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది. కేజీఎఫ్ సిరీస్, చార్లీ 777, విక్రాంత్ రోనా, కంతారా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బనారస్ పట్టణంలో 85 శాతం షూటింగు జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    బనారస్ బడ్జెట్ ఎంతంటే?

    బనారస్ బడ్జెట్ ఎంతంటే?

    కన్నడలో రూపొందిన బనారస్ చిత్రాన్ని భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్‌ 35 నుంచి 40 కోట్ల మధ్య అయిందనే ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఈ సినిమాను కన్నడ రాష్ట్రంలో 250 స్క్రీన్లకుపైగా ప్రదర్శించారు.

    కర్ణాటకలో ఆక్యుపెన్సీ

    కర్ణాటకలో ఆక్యుపెన్సీ

    బనారస్ చిత్రానికి కన్నడ భాషలో మంచి ఆక్కుపెన్సీ కనిపించింది. బెంగళూరు, హుబ్లీ, బెల్గాం, గుల్బర్గా, తుమకూరు ప్రాంతాల్లో భారీ రెస్సాన్స్ లభించింది. కన్నడ రాష్ట్రంలో ఈ సినిమాకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

    మిగితా భాషల్లో ఆక్యుపెన్సీ

    మిగితా భాషల్లో ఆక్యుపెన్సీ

    ఇక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో మంచి స్పందన లభించింది. హైదరాబాద్‌లో 54 శాతం ఆక్యుపెన్సీ లభించింది. ఢిల్లీ, ముంబై, పూణే పట్టణాలలో సానుకూలంగా రెస్పాన్స్ లభించింది.

    బనారస్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    బనారస్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    ఇక బనారస్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కన్నడ భాషలో ఈ సినిమా తొలి రోజు 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

    English summary
    Kannada Director Jayatheertha's latest movie is banaras. Zaid Khan and Sonal are lead pair. This movie hits the theatres on November 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X