Band Melam Day 1 Collections: బ్యాండ్ మేళంకు షాకింగ్ కలెక్షన్స్.. కోర్ట్ జంట నటించిన మూవీకి తొలిరోజు ఎంతంటే?

కోర్ట్ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ డమ్ అందుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవి అపాళ్ల. ఈ సినిమాలో నటనకు గాను వీరిద్దరికీ పాపులారిటీతో పాటు మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందాయి. తాజాగా హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. శ్రీరామనవమి కానుకగా మార్చి 26న బ్యాండ్ మేళం మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు బ్యాండ్ మేళం మూవీ వసూళ్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

బ్యాండ్ మేళం తారాగణం
కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్యలతో కలిసి ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ బ్యాండ్ మేళం మూవీని నిర్మించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పించింది. సతీష్ జవ్వాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, గోపరాజు విజయ్, లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. విజయ్ బుల్గానియన్ సంగీతం అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, శివ ముప్పరాజు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అందించారు.

Band Melam Day 1 Expected Box Office Collections Worldwide Kona Venkat s film good start at GBOC

బ్యాండ్ మేళం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బ్యాండ్ మేళం మూవీని 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు, స్టాండర్డ్స్ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో బ్యాండ్ మేళం మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు కోర్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన హర్ష్ రోషన్, శ్రీదేవి నటిండంతో అంచనాలు పెంచేసింది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ జంటను దీవించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బ్యాండ్ మేళం మూవీ బ్రేక్ఈవెన్ టార్గెట్
బ్యాండ్ మేళం మూవీ రేంజ్‌కు తగినట్లుగానే థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5, శాటిలైట్ రైట్స్‌ని జీ సినిమాలు దక్కించుకున్నాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమాను పార్శ్ ఫిలింస్ సంస్థ రిలీజ్ చేసింది. బ్యాండ్ మేళం మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

బ్యాండ్ మేళం మూవీ తొలిరోజు కలెక్షన్స్
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలు థియేటర్‌లో ఉండగా బ్యాండ్ మేళం మూవీ బరిలోకి దిగాలని అనుకోవడం నిజంగా సాహసం అని చెప్పొచ్చు. ప్రేమకథ కావడంతో యూత్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి బ్యాండ్ మేళం మూవీకి తొలిరోజున 18 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు కావొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 38 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తొలి రోజున బ్యాండ్ మేళం మూవీ కోటి రూపాయల నుంచి కోటి 20 లక్షల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ధురంధర్ 2 ప్రభంజనంలో బ్యాండ్ మేళం ఏ రేంజ్‌లో మోగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X