Bandla Ganesh : పవన్ ఫాన్స్ కి పండుగ లాంటి వార్త..పుట్టినరోజు నాడు వారి కోసం స్పెషల్ !

చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మెగా అభిమానులు. ఇక మరి కొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా దగ్గర పడుతుండటంతో ఆయన పుట్టిన రోజు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ పుట్టినరోజు గ్రాండ్ గా జరుపుకోవాలని భావిస్తున్న అభిమానులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా ట్రెండ్స్ ను సృష్టించడానికి వాళ్ళు అనేక ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో అభిమానులు అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు బండ్ల గణేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ - బండ్ల గణేష్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో 100 థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బండ్ల గణేష్ ని కూడా సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నిస్తూ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ రెండో తారీకున బాస్ బర్తడే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్ జై దేవర అని బ్ద్న్ల గణేష్ చెప్పుకొచ్చారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్ కి వరుసగా మా ఊరిలో వేయండి, మా ఊరిలో వేయండి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉండడంతో బండ్ల గణేష్ కూడా ఎప్పటికప్పుడు ఓకే, ఓకే, ఓకే అనుకుంటూ వచ్చారు. చివరికి అందరికీ సమాధానం చెప్పలేక మీ ఊరిలో ఉన్న థియేటర్లు బ్లాక్ చేసుకోండి స్నేహితులారా అని సమాధానం ఇచ్చారు.

Bandla Ganesh to arrange 100 Gabbar singh shows on pawan kalyan birthday

అంతేకాక దేవర అభిమానులు సెప్టెంబర్ 2వ తేదీన తమ ఊర్లో థియేటర్ లో టికెట్ బుక్ చేసుకోండి, గబ్బర్ సింగ్ ఇంకోసారి వీక్షించి పండగ చేసుకుందాం అని పేర్కొన్నారు. అంతేకాక ఎవరు సినిమా చూడాలి అనుకుంటే వాళ్ళు మీ ఊరిలో ఉన్న థియేటర్ బుక్ చేసుకోవాలని మీకు పర్మిషన్ నేను ఇస్తానని మనందరం కలిసి ఎంజాయ్ చేద్దామని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద బండ్ల గణేష్ హామీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ మరోసారి తమ అభిమాన హీరో చరిత్ర సృష్టించిన సినిమాతో మళ్ళీ ఫుల్ ఖుష్ అవ్వడానికి ఎదురు చూస్తున్నారు. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి వివిధ అప్డేట్స్ రావొచ్చని భావిస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆయా సినిమా యూనిట్ల నుంచి అదిరిపోయే అప్డేట్స్ లభిస్తాయని కూడా భావిస్తున్నారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఎంత ఘనంగా జరుపబోతున్నారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X