Just In
- 21 min ago
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించిన నాగ్
- 10 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 10 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 11 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
Don't Miss!
- News
వంటగదిలోని "పోపులపెట్టే" మన వైద్యశాల
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
నిరాశ పరుస్తున్న బందోబస్త్ కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!
సూర్య హీరోగా 'రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'బందోబస్త్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కాప్పన్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'బందోబస్తు' పేరుతో విడుదల చేశారు. మోహన్ లాల్, ఆర్యలు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా కలెక్షన్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

తొలిరోజే నిరాశ
హీరోగా సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండేది. కానీ బందోబస్త్ సీన్ అలా కనిపించలేదు. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలిరోజే కలెక్షన్స్ పరంగా నిరాశ పర్చింది. దీంతో సూర్య స్టామినా ఇంతలా పదడిపోయిందా అనుకుంటున్నారంతా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిన సూర్య ఈ సారి మాత్రం తొలిరోజు కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది బందోబస్త్ సినిమా. ఇక రెండో రోజు విషయానికొస్తే ఆ లెక్కలు మరింతగా పడిపోయాయి.

రెండో రోజు కలెక్షన్ రిపోర్ట్
మొదటి రోజు కోటి రాబట్టింది కాబట్టి రెండో రోజు కనీసం 60 నుంచి 70 లక్షల షేర్ అయినా వస్తుందని అంతా భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కేవలం 28 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది బందోబస్త్. దీంతో సూర్య అభిమానులు కాసింత నిరాశకు లోనయ్యారు.

ఆ ఛాయలు కూడా కనిపించడం లేదుగా
తెలుగులో 'బందోబస్త్' ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్ల మేర జరిగింది. సో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 10 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కలెక్షన్స్ చూస్తుంటే దానికి దగ్గరగా వెళ్లే సూచనలు కూడా కనిపించడం లేదు. దీంతో ఓ పెద్ద హీరో సినిమా కలెక్షన్స్ మరీ మరీ ఇంత దారుణమా! అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.