twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పోస్టర్..ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తోంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : పోస్టర్స్, ప్రోమోలు, ఫస్ట్ లుక్ లు వీటితోనే ఓపినింగ్స్ వచ్చేవి. అందుకే వాటి డిజైనింగ్ లో ప్రత్యేకమైన శ్రద్దని చూపిస్తూంటారు. తాజాగా హృతిక్‌రోషన్‌ హీరో నటించిన 'బ్యాంగ్‌ బ్యాంగ్‌' చిత్రంలోని కొత్త పోస్టర్‌ సోమవారం విడుదలైంది. అందులో కత్రినాకైఫ్‌తో కలసి హృతిక్‌రోషన్‌ కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

    ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో ఆ పోస్టర్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. హాలీవుడ్‌ చిత్రం 'నైట్‌ అండ్‌ డే'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంస్థపై రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల రెండున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. 'జిందగీ మిలేగీ న దొబారా' చిత్రం తర్వాత హృతిక్‌, కత్రినా కలసి నటిస్తున్న చిత్రమిది. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Bang Bang : Banging 'Hot' Poster!!

    ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 'తూ మేరీ' సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగులో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ మధ్య వచ్చే కొన్ని మూమెంట్స్ వావ్ అనే విధంగా ఉన్నాయి.

    English summary
    Hrithik Roshan's latest action bonanza Bang Bang is getting ready for an October 2nd worldwide release. latest poster is doubling the expectations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X