ఎవరు మాట్లాడినా ఈ సినిమా కలెక్షన్స్ గురించే
ముంబై: ఇటీవలే విడుదలై భారీ కలెక్షన్లు అందిస్తున్న సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా బ్యాంగ్ బ్యాంగ్ . మార్నింగ్ షో కే యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా మరిన్ని రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్‌లు జంటగా నటించిన ఈ సినిమా దేశ విదేశాల్లో విడుదలైన అయిదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.
బ్యాంగ్ బ్యాంగ్ సోమవారం రూ.100 కోట్ల కలెక్షన్లు దాటడంతో వంద కోట్ల కలెక్షన్ సినిమా జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు రెండొందల కోట్ల మ్యాజిక్ నెంబర్‌ను కూడా దాటింది. 2014లో అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తదితర దేశాల్లో అతి పెద్ద ఓపెనింగ్ కలెక్షన్లను ఈ సినిమానే సొంతం చేసుకుంది. క్రిష్ 3 తర్వాత బాలీవుడ్‌లో రెండో అతిపెద్ద బాలీవుడ్ ఓపెనింగ్ సినిమాగా బ్యాంగ్ బ్యాంగ్ పేరు దక్కించుకుంది. పాకిస్థాన్‌లోనూ బ్యాంగ్ బ్యాంగ్‌కు వారంలో 32వేల డాలర్ల కలెక్షన్ వచ్చింది.

చిత్రం కథేమిటంటే...లండన్ లో కోహినూర్ వజ్రం ఉంటుంది. దాన్ని రాజ్ వీర్(హృతిక్ రోషన్)దొంగతనం చేస్తాడు. అయితే ఆ వజ్రాన్ని అతని నుంచి లేపేయటానికి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఓమర్ జాఫర్(డానీ), హమీద్ గుల్(జావెద్ జాఫ్రీ) గ్యాంగ్ వెంటపడుతూంటూంది. అయితే ఈ మాఫియా గ్యాంగ్ లకు దొరకకుండా ఓమర్ జాఫర్ ని ఎలగైనా కలుసుకోవాలని రాజ్ ప్రయత్నిస్తూంటారు. ఇంతకీ రాజ్...ఓమర్ జాఫర్ ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు. ఈ ఛేజింగ్ లో రాజ్ తో కలిసిన హర్లీన్(కత్రినా) ఎవరు... అసలు కోహినూర్ వజ్రం దొంగతనం వెనక ఉన్న అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే చిత్రం పూర్తిగా చూడాల్సిందే.
హాలీవుడ్ సినిమా 'నైట్ అండ్ డే'కిది రీమేక్. 2010లో విడుదలైన ఈ చిత్రంలో టామ్ క్రూయిజ్, కెమెరన్ డియాజ్ ప్రధాన పాత్రధారులు. 'బ్యాంగ్ బ్యాంగ్'ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ చిత్రం లాంటి కథ,కథనాలు మనకు గతంలో కొన్ని చిత్రాల్లో వచ్చేసి ఉండటంతో పెద్ద గొప్పగా లేదు అని అంతా పెదవి విరిచారు. అయితే హృతిక్ రోషన్ చేసిన సాహసాలు, కత్రినా అందచందాలు ఈ సినిమాకు ప్లస్. వీటిని అద్బుత రీతిలో ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











