Bangarraju 10 Days Collections: అక్కినేని హీరోలకు కలిసొచ్చిన సండే.. బంగార్రాజు హిట్ అవ్వాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఏఎన్సార్ తర్వాత ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం కావడమే. అంతేకాదు, నిర్మాణ రంగంలోనూ ఈ ఫ్యామిలీ ముందుంటుంది. ఈ కుటుంబం నుంచి గతంలో 'మనం' లాంటి స్పెషల్ ఫిల్మ్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత అక్కినేని నాగార్జున.. తన కొడుకు నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాలో నటించాడు.

Recommended Video

Akkineni Nagarjuna Whistle Podu Moment At Bangarraju Musical Night Part 3 | Filmibeat Telugu

భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే దక్కుతోంది. అయితే, ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇది మళ్లీ పుంజుకుంది. ఇక, ఈ సినిమా పది రోజుల రిపోర్టును మీరూ చూడండి!

సంక్రాంతికి బంగార్రాజు అరాచకం

సంక్రాంతికి బంగార్రాజు అరాచకం

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన చిత్రమే ‘బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

అక్కినేని హీరోల కాంబోలో వచ్చిన ‘బంగార్రాజు' మూవీ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగింది.

10వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

10వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

‘బంగార్రాజు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10వ రోజూ కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 11 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 10వ రోజు రూ. 81 లక్షలు షేర్, రూ. 1.45 కోట్ల గ్రాస్ వచ్చింది.

10 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

10 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

‘బంగార్రాజు'కు 10 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.81 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.70 కోట్లు, గుంటూరులో రూ. 3.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.08 కోట్లు, నెల్లూరులో రూ. 1.64 కోట్లతో.. రూ. 32.39 కోట్లు షేర్, రూ. 52.47 కోట్లు గ్రాస్ సొంతమైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో కలిపి 10 రోజులకు రూ. 32.39 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.68 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.42 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 35.49 కోట్లు షేర్‌తో పాటు రూ. 58.50 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లోనే రూ. 35.49 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.51 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X