twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 12 Days Collections: మరింత పడిపోయిన వసూళ్లు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్

    |

    చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. తన కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమా చేశాడు. నాలుగేళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయకు'కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు.

    చాలా తక్కువ సమయంలోనే పూర్తైన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    సంక్రాంతికి అక్కినేని హీరోల రచ్చ

    సంక్రాంతికి అక్కినేని హీరోల రచ్చ

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'బంగార్రాజు'. ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయింది.

    Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల వ్యాపారం జరిగిందని తెలిసింది.

    12వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    12వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    'బంగార్రాజు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 12వ రోజు కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 12వ రోజు రూ. 26 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చమరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

    12 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    12 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    'బంగార్రాజు'కు 12 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.86 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.90 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.75 కోట్లు, గుంటూరులో రూ. 3.27 కోట్లు, కృష్ణాలో రూ. 2.12 కోట్లు, నెల్లూరులో రూ. 1.67 కోట్లతో.. రూ. 33.01 కోట్లు షేర్, రూ. 53.45 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఆంధ్రా, తెలంగాణలో కలిపి 12 రోజులకు రూ. 33.01 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.44 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 36.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.60 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చహాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

     టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    అక్కినేని హీరోల కలయికలో వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 36.15 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.85 కోట్లు వస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 36.15 Crores in 12 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X