twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 13 Days Collections: రిపబ్లిక్‌ డేన కుమ్మేసిన బంగార్రాజు.. ఒక్కసారిగా కలెక్షన్లు డబుల్

    |

    కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. నాలుగేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా వచ్చిన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి దీనికి సీక్వెల్ తీయాలని డైరెక్టర్, హీరో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

    ఇలా గత ఏడాది 'బంగర్రాజు' ప్రాజెక్టును ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే దీన్ని పూర్తి చేసి.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిపారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చినా.. తర్వాత తగ్గుతూ వస్తున్నాయి. కానీ, రిపబ్లిక్ డేన బంగార్రాజు కుమ్మేశాడు. మరి ఈ సినిమా 13 రోజుల రిపోర్టును మీరూ చూడండి!

    బంగార్రాజుగా అక్కినేని హీరోల రచ్చ

    బంగార్రాజుగా అక్కినేని హీరోల రచ్చ

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలయికలో కల్యాణ్ కృష్ణ రూపొందించిన చిత్రమే 'బంగార్రాజు'. ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న విడుదల అయింది.

    రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    సంక్రాంతి బరిలో నిలిచిన 'బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

    13వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    13వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    'బంగార్రాజు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 13వ రోజు కలెక్షన్లు డబుల్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 13వ రోజు రూ. 51 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వచ్చింది.

    ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

    13 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    13 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    13 రోజులకు కలిపి 'బంగార్రాజు'కు ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.96 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.97 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.79 కోట్లు, గుంటూరులో రూ. 3.32 కోట్లు, కృష్ణాలో రూ. 2.16 కోట్లు, నెల్లూరులో రూ. 1.69 కోట్లతో.. రూ. 33.52 కోట్లు షేర్, రూ. 54.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ, తెలంగాణలో కలిపి 13 రోజులకు రూ. 33.52 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ స్లోగా నడిచింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.73 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.45 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 13 రోజుల్లోనే రూ. 36.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 61.55 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్‌ ఈ రేంజ్‌లోనా!షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్‌ ఈ రేంజ్‌లోనా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లోనే రూ. 36.70 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.30 కోట్లు వస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

    రిపబ్లిక్ డేన డబుల్ కలెక్షన్లతో రచ్చ

    రిపబ్లిక్ డేన డబుల్ కలెక్షన్లతో రచ్చ

    బంగార్రాజు మూవీకి కొద్ది రోజులుగా వసూళ్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 13వ రోజు రిపబ్లిక్ డే సెలవు వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు డబుల్ అయ్యాయి. ఇక, 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీ.. నిన్న మాత్రం ఏకంగా రూ. 51 లక్షలు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌కు మరింత దగ్గరగా వచ్చింది.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 36.70 Crores in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X