Bangarraju 15 Days Collections: శుక్రవారం దారుణంగా కలెక్షన్లు.. 15 రోజుల్లో తొలిసారి ఇంత తక్కువగా!

చాలా కాలంగా సరైన బ్రేక్ లేక సతమతం అవుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ విజయం మాత్రం ఆయన దరి చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న తన కుమారుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాను చేశాడు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 15 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

 సంక్రాంతి బరిలో అక్కినేని హీరోలు

సంక్రాంతి బరిలో అక్కినేని హీరోలు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలయికలో రూపొందిన చిత్రమే ‘బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

15వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

15వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

15వ రోజు ‘బంగార్రాజు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 15వ రోజు రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

2 వారాలకు కలిపి వచ్చింది ఎంత

2 వారాలకు కలిపి వచ్చింది ఎంత

‘బంగార్రాజు'కు 15 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.04 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.82 కోట్లు, గుంటూరులో రూ. 3.36 కోట్లు, కృష్ణాలో రూ. 2.19 కోట్లు, నెల్లూరులో రూ. 1.71 కోట్లతో.. రూ. 33.92 కోట్లు షేర్, రూ. 55.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో కలిపి 15 రోజులకు రూ. 33.92 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో నిరాశ పరిచింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.46 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 15 రోజుల్లో రూ. 37.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.35 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

Recommended Video

Bangarraju Will Be The Sankranthi 2022 Winner For Sure - Nagarjuna | Filmibeat Telugu
 టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో రూ. 37.12 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.88 కోట్లు వస్తేనే బంగార్రాజు మూవీ హిట్‌ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X